Saturday, November 21, 2009

తొలి ముద్దు

నేను పెట్టిన తోలిముద్దుకంటే నేను తీసుకున్న తొలిముద్దు మదురమైనది . మరచిపోనిది .మరి నేను పెట్టిన తొలిముద్దు గురించి తరువాత మాట్లాడుకుందాం . మొదటిగా నేను తీసుకున్న తొలిముద్దు గురించి . ఇది దాదాపు పన్నెండు సంవత్సరాల క్రిందటి విషయం . మదిలో పదిలంగా దాచుకున్న విషయం .
సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన నీను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను . నాకు ఇక్కడ ఎవరూ తెలియదు . కాని ఏదో గుడ్డి దైర్యం . ఎక్కడైనా అవకాసం దొరకలేకపోతుందా అని ఒక నమ్మకం . నా నమ్మకం వమ్ము కాలేదు . ఒక కంపెనీ లో సైట్ ఇంజినీర్ జాబ్ దొరికింది . కాని జాబ్ హైదరాబాద్ లో కాదు , పూణే లో . ఒకసారి ఇల్లు వదలి వచ్చిన తరువాత ఎక్కడైతే ఏమి వుంది . సో నెను ఒప్పుకున్నాను . వెంటనే ట్రైన్ టికెట్ ఇవ్వడం నెను ట్రైన్ ఎక్కడం జరిగిపోఇంది .
మరుసటి రోజు పూణే లో అడుగు పెట్టాను . అసలు సమస్య ఇప్పుడే స్టార్ట్ అయింది . నాకు హిందీ కొంత వచ్చు . కానీ ఇక్కడ అందరు మరాటి మాట్లాడుతున్నారు . అస్సలు అర్తం కాలేదు . ఈలోగా అక్కడ లోకల్ ఆఫీసుకు ఫోన్ చేసి ఎలా వెళ్ళాలో కనుక్కున్నాను .
ఎలాగో ఒక విదంగా ఆటో వాడితో పోరాడి ఆఫీసుకి వెళ్ళాను . వాళ్ళు రూం ఏర్పాటు చేసారు . రూం అంటే హోటల్ రూం లాగా వుహించుకోకండి . జస్ట్ నాలుగు గోడలు తప్ప మరి ఇంకేమి వుండదు . పడుకోవడానికి ఒక పలక (వుడ్)
ఎలాగో ఒక విదంగా కాసేపు రెస్ట్ తీసుకుని ఆఫీసు చేరాను .

అక్కడ చాలామంది వున్నా నా చూపు అక్కడవున్న మెరుపు తీగ పైన పడడం కొత్తేమి కాదు . ఒక్కసారి వళ్ళు పులకరించింది . కానీ సమస్య అంతా తనతో ఎలా మాట్లాడడం ? తొందరపడితే కాదు కదా . సమయం కోసం వేచి వుండడం ఒకటే పరిష్కారం .
అందుకే ఆమె విషయం అంతటితో వదిలేసి పని పైన శ్రద్ద పెట్టడానికి ప్రయత్నించాను . కాని వీలు కాలేదు . అందుకే ఆమె గురిచి ఆలోచనలతో మనసు బరువెక్కడంతో సైట్ వైపు కదిలాను .
రోజురోజుకి తనగురించి ఒక్కొక్క విషయం తెలిసింది . అసలు విషయం ఏమిటంటే మన తెలుగు సినిమా లో హీరోయిన్ ముగ్గురు నలుగురు అన్నలు వుండే లాగా ఈ హీరోయిన్ కి నలుగురు అన్నలు . ఆ విషయం ఎలా తెలిసిందంటే ..
ఒక రోజు మా బాస్ నా కొలీగ్ ని చాల గోరంగా తిడుతున్నారు . అసలు విషయం ఏమిటని ఆరాతీస్తే , నా కొలీగ్ ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాసాడని దానిని తెలిసిన ఆ అమ్మాయి అన్నయ్యలు వచ్చి వేడిని చితకబాది మా బాస్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు అని తెలిసింది .
ఆ విషయం తెలిసినవెంటనే నాకు ఒక్క సరి వళ్ళు జలపరించింది . అంతే ఆరోజునించి తనవైపు చూడడం మానేసాను . తను ఉన్న కాబిన్ వైపుకూడా వెళ్ళడం మానేసాను .
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం . ఆమె నాకంటే దాదాపు ఇదు సంవత్సరాలు పెద్ద . తను నా గురించి అలోచంచడానికి ఏమాత్రం అవకాసం లేదు . లైఫ్ ఒకే విదంగా సాగి పొతే మరి మజా ఏమి వుంటుంది . అప్పుడే నా లైఫ్ లో ఒకే పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది . అది నా ప్రమోషన్ రూపంలో . నాకు ప్రమోషన్ తో బాటు నా సీటు కూడా మార్చారు . సో ఆ విదంగా నేను ఆమె కూర్చునే కాబిన్ లోకి మారాను .
అప్పుడే తనతో మాటలు కలిసాయి . తనగురుంచి తెలిసింది . చాల ఫ్రెండ్లీగా మాట్లాడుకొనే వాళ్ళం . తన కంటే వయసులో చిన్నవాడిని కావడంతో కాస్త ఎక్కువ చనువు చూపించేది . ఆ మాత్రం చనువుకే చాలా ఆనంద పడిపోయేవాడిని . అలా నా లైఫ్ లో చాలా మదురమైన రోజులలో అవి ముక్యమైనవి . మా ఆఫీసుకు ఆమె బస్ స్టాప్ కు తనతో పటు ప్రతి రోజు తోడూ వెళ్ళేవాడిని .
అలా గడుస్తున్న మా ఫ్రెండ్షిప్ ఒక రోజు ఊహించని మలుపు తిరిగింది .
ఆరోజు ఇద్దరమూ నడిచి వెలుతున్నాము .
మాటల సందర్బంలో నేను ఆమెని అడిగాను .
"ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో చాల రోజులుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకున్నాను "
" అడుగు "
" తరువాత మీరు ఫీల్ కాకూడదు'
" పరవాలేదు , నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ . ఏమైనా అడగవచ్చు "
" ఆ రోజు మన కొలీగ్ ని మీ అన్నయ్యలతో ఎందుకు కొట్టించారు ? "
" ఓ అదా? అసలు గొడవ అతను రాసిన లెటర్ కాదు . అతని ప్రవర్తన . "
" ఒక వేళ నేను కూడా మీకు లవ్ లెటర్ రాస్తే నాకు కూడా అదే జరుగుతుందా ? "
" మంచి జోక్ . నీకు నాకు చాలా వత్యాసం వుంది . మన కులం , మన మతం , మన వయసు అన్నీ మనకు వ్యతిరేకంగా వుంది . సో ఎ విదంగా చూసిన మన మద్య ప్రేమ సాధ్యమయ్యే విషయం కాదు "
ఆమె చెబుతున్నది వింటుంటే నాకు ఒక్కటే అర్తం ఐంది . తను నా గురించి ఏదో మనసులో అనుకుని వుంది .
ఆమె బస్ ఎక్కి వెళ్ళిపోయింది . కానీ నా మనసు ఏదో ఐపోయింది .
ఇక ఆలస్యం చేయలేదు . మరుసటి రోజు నా ఫీలింగ్స్ అన్ని పూసగుచ్చినట్టు రాసి ఆమె చేతుల్లో పెట్టాను .
అ తరువాత రెండు రోజుల వరకు తన కంటికి కనిపించలేదు . ఎందుకంటే ఏమి చెబుతుందో , ఏమవుతుందో తెలియని ఆందోళన .
చివరకు ఆమె నా దగ్గరికి వచ్చింది
"లెటర్ ఇచ్చావు , తరువాత కనిపించలేదు . ఎందుకు ?"

నేను ఏమీ మాట్లాడ లేదు
" నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నీకు నాకు చాలా వత్యాసం వుంది . మన కులం , మన మతం , మన వయసు అన్నీ మనకు వ్యతిరేకంగా వుంది . సో విదంగా చూసిన మన మద్య ప్రేమ సాధ్యమయ్యే విషయం కాదు . అ విషయం నీకు ఎందుకు అర్తం కాలేదో నాకు తెలియడం లేదు ."
" చూడండి నేను మీకు లవ్ లెటర్ రాయడం నా ఉద్దేశం కాదు . నా ఫీలింగ్స్ మీకు చెప్పాలని పించింది . అంతే . నేను మీ సమాదానం కూడా అడగలేదు . జస్ట్ చెప్పాను అంతే . "
" సరే నా ఫీలింగ్స్ రేపు చెపుతాను " ఆమె వెళ్ళిపో యింది .
అ రాత్రంతా నిద్ర లేకుండా ఏలే గడిపానో నాకు తెలియదు . లైఫ్ లో మొదటిసారి . అస్సలు మన తెలుగు సినిమాలో చూపించినట్టు , పడుకుంటే నిద్ర రాక పోవడం , మనసంతా ఒకటే ఆందోళనగా వుండడం ....ఇలా రకరకాలుగా అనిపించింది . ఎలాగో తెలవారింది .
కాని ఆశ్చర్యంగా ఆమె చాల నిర్మలంగా వుంది. తనలో ఎటువంటి ఫీలింగ్స్ లేనట్టుగా చాలా ప్రశాంతంగా వుంది . ఇది ఎలా సాద్యం . నేను పడుతున్న వేదన ఏంటి .. తను ఎలా ఈ విదంగా వుండగలుగుతోంది .
ఒకటి రెండు సార్లు ఆమె ఎదురు పడి తనని కళ్ళతోనే పలకరించాను . చిన్న చిరునవ్వు అంతే . ఏమీ రిప్లై లేదు .
ఆరోజు వర్క్ ఐపోయింది . అందరు వెళుతున్నారు . కానీ ... కాని తను నాకు ఏమీ చెప్పలేదు . ఇక ఆఫీసు లో నేను , ఆమె ఇద్దరమే మిగిలాము . తను కూడా బయలుదేరింది . ఏమైనా చేపుతుందేమో అని వెయిట్ చేశాను , కాదు.. కాదు వెయిట్ చేస్తూనే వున్నాను . తను అక్కడే వున్న రిజిస్టర్ లో సైన్ చేసి వెళ్ళిపోయింది .
ఇక చవరగా నీను కూడా సైన్ చేయడానికి వంగాను . ఇంతలో పక్కన ఎవరో వచ్చినట్టు అనిపించింది . నేను తిరిగి చూడపోతున్నాను . ఆమె వంగి నా బుగ్గ మీద పెట్టపోతున్న ముద్దు నేను తిరగడంతో నా పెదవులపై తాకింది .......

ఆమె సమాదానం చెప్పింది ... ఒక అల నాన్నను తాకుతున్నట్లు .. ఒక వెన్నల కిరణం నన్ను సోకినట్లు ...
అదే నీ జీవితంలో నేను అందుకున్న తొలి ముద్దు .....................

మరి మీ తొలి ముద్దు ఎప్పుడు ?

నా వూహ కరెక్ట్ ఐతే ఈ పాటికే మీ తొలి ముద్దు మీకు గుర్తుకు వచ్చి వుంటుంది ..

కాస్త ఇక్కడ షేర్ చేసుకుంటే అందరూ తెలుసుకొని పులకరిస్తారు ....

ఓకే

0 comments: